తెలంగాణ ప్రభుత్వం 2025-26 (Telangana Budget 2025-26)ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ (Aarogyasri) పథకంలో మార్పులు చేయడంతో లక్షలాది పేద ప్రజలకు ఇది వరంగా మారనుంది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా 1,835 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. దీని ద్వారా 90 లక్షల పేద కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ. 1,143 కోట్లు కేటాయించడం ప్రభుత్వం వైద్య రంగంపై చూపిస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
Nagpur Violence : నాగ్‌పూర్ అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక వివరాలు
రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వైద్య రంగానికి మొత్తం రూ. 12,393 కోట్లు కేటాయించడం గమనార్హం. ఉచిత వైద్యం, వైద్య కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి ‘తెలంగాణ రైజింగ్ 2050’ ప్రణాళికను రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Telangana Budget 2025-26 : బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
విద్యా రంగంలోనూ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు కల్పించనుంది. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. విద్యార్థులకు సాయంత్రం ఉచిత స్నాక్స్ పథకం ప్రవేశపెట్టనుంది. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించింది. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అమలు చేయడం ద్వారా విద్యుత్ వినియోగంలో సమర్థత పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకొచ్చారు.