Agniveers – Secunderabad : ‘అగ్నివీర్’‌ల భర్తీకి ఏఆర్‌వో సికింద్రాబాద్‌ నోటిఫికేషన్

Agniveers - Secunderabad : భారత సైన్యంలో అగ్నివీర్‌లుగా పనిచేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 02:08 PM IST

Agniveers – Secunderabad : భారత సైన్యంలో అగ్నివీర్‌లుగా పనిచేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ‘అగ్నిపథ్’ స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు వీటికి అప్లై చేయొచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ , అగ్నివీర్ టెక్నికల్ విభాగాల్లో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభంకాగా..  మార్చి 22 వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేయొచ్చు. అభ్యర్థులకు ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించే  వారికి  తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్ల పాటు అగ్నివీర్‌లుగా భారత సైన్యంలో పనిచేయాలి.

We’re now on WhatsApp. Click to Join

ఎవరు అర్హులు ?

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.

Also Read : MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్

కీలకమైన వివరాలు ఇవీ.. 

  • 17.5  ఏళ్ల నుంచి 21 ఏళ్ల  మధ్య వయసున్న వారు అప్లై చేయొచ్చు.  అంటే అభ్యర్థులు 01.10.2003 నుంచి 01.04.2007 మధ్య జన్మించి ఉండాలి.
  • అగ్నివీర్ జీడీ/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు అప్లై చేసేవారి హైట్ 166 సెం.మీ, అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు హైట్ 165 సెం.మీ, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు హైట్ 162 సెం.మీ. ఉండాలి.
  • అభ్యర్థుల ఛాతీ కొలత గాలి పీల్చినపుడు 5 సెం.మీ విస్తరణతో 77 సెం.మీ మేర ఉండాలి.
  • ఈ జాబ్స్‌కు దరఖాస్తు ఫీజు రూ.250.
  • ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  •  ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే వారు కచ్చితంగా నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాలి. ఈ సమయంలో మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం.
  • నాలుగేళ్లు సర్వీసు తర్వాత ‘సేవా నిధి ప్యాకేజీ’ కింద రూ.10.04 లక్షలు ఇస్తారు.

ఏయే పోస్టుకు ఏయే అర్హత.. 

  • అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
  • అగ్నివీర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read : Chhatrapati Shivaji : ఛత్రపతి శివాజీ జయంతి.. ఆ మహాయోధుడి జీవిత విశేషాలివీ