AR Constable Suicide: రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్ కలకలం రేపింది. రాచకొండ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ శనివారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతుడు డి.బాలకృష్ణగౌడ్ (28)గా గుర్తించారు. బాలకృష్ణగౌడ్ రంగారెడ్డి కలెక్టరేట్‌లో గార్డు సెక్షన్‌లో పనిచేస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ గౌడ్ (Balakrishna Goud) 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్(AR Constable)గా పని చేస్తున్నారు. బాలకృష్ణ శుక్రవారం రాత్రి డ్యూటీకి రిపోర్టు చేసాడు. తన షిఫ్ట్ పూర్తి చేసుకుని వాష్‌రూమ్‌కి వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు తన సర్వీస్ రైఫిల్‌తో తలపై కాల్చుకున్నాడు. అయితే భారీ శబ్దం రావడంతో సహచర కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాలకృష్ణ గౌడ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెల్లడయ్యాయి.
కానిస్టేబుల్ బాలకృష్ణకు వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. దానితో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. గతంలో తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. అయితే తన ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉన్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసగా మారడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.
Also Read: Jagan Tirupati Visit Controversy: జగన్‌ను ఆపిందెవరు: సీఎం చంద్రబాబు