Site icon HashtagU Telugu

Electricity Bill Payment : TGSPDCL, TGNPDCL‌ యాప్స్, వెబ్‌సైట్స్‌లో కరెంటు బిల్లు కట్టడం ఇలా..

Electricity Bill

Electricity Bill

Electricity Bill Payment : ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే, గూగుల్ పే యాప్స్‌లో కరెంటు బిల్లు కట్టే ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.  జులై 1 నుంచి ఈ యాప్స్‌లో కరెంటు బిల్లు పేమెంట్స్ ఆగిపోయాయి. ఈనేపథ్యంలో TGSPDCL, TGNPDCL‌  విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం. ఈ రెండు విద్యుత్ సంస్థలకు రెండు ప్రత్యేక వెబ్ సైట్లు, మొబైల్ యాప్స్ ఉన్నాయి. ఈ వార్తలో మనం  TGSPDCL వెబ్‌సైట్, యాప్ ద్వారా కరెంటు బిల్లు(Electricity Bill Payment) కట్టే విధానం గురించి తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

TGSPDCL యాప్ ద్వారా పేమెంట్ ఇలా.. ​ 

తొలుత మనం TGSPDCL మొబైల్ యాప్‌‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌‌లో తొలుత మనం రిజిస్టర్​ చేసుకోవాలి. ఇందుకోసం కరెంటు బిల్లుపై ఉండే 9 అంకెల యూఎస్‌సీ నంబరు, ఫోన్ నంబరు, పేరును ఎంటర్‌ చేసి.. Get OTP అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ వెంటనే మన ఫోనుకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి..  చివరగా Register అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీకు యాప్‌లో స్క్రీన్‌పై Pay Bill అనే ఆప్షన్ కనిపిస్తుంది. తదుపరిగా మన మెయిల్​ ఐడీని ఎంటర్​ చేసి Proceed to Pay అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఈక్రమంలో Pay With T-Wallet/ Bill Desk/Paytm అనే ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. వాటిలో మనకు అనువైన పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. బిల్లు కట్టిన తర్వాత Bill Historyపై క్లిక్‌ చేసి పేమెంట్‌ వివరాలను చెక్‌ చేసుకోవచ్చు.

TGSPDCL వెబ్​సైట్​ ద్వారా పేమెంట్ ఇలా.. 

తొలుత మనం TSSPDCL అధికారిక వెబ్‌సైట్‌‌లోకి వెళ్లాలి. ఇందులో Pay Bill online అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో 9 అంకెల యూఎస్‌సీ నంబరును ఎంటర్‌ చేసి సబ్మిట్  చేయాలి. స్క్రీన్​‌పై ప్రత్యక్షమయ్యే మన బిల్లు వివరాలను చెక్​ చేసి, Current Month Bill  అనే సెక్షన్​లోకి వెళ్లి Click Here to Pay ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. దీంతో తదుపరిగా మన ముందు వివిధ రకాల పేమెంట్ ఆప్షన్లు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో మనకు అనువైన ఆప్షన్ ద్వారా కరెంటు బిల్లు పేమెంట్ చేసేయొచ్చు.  ఇదంతా ఎందుకు అని భావించేవారు నేరుగా సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి కరెంటు బిల్లు పే చేయొచ్చు.