Site icon HashtagU Telugu

Employment Exchange 2024: తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్.. రిజిస్ట్రేషన్‌ ఇలా

Employment Exchange 2024

Employment Exchange 2024

Employment Exchange 2024 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లపై సమాచారాన్ని అందించడానికి 2024 సంవత్సరానికిగానూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.  రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు ఇప్పుడు ‘వర్క్ ఎక్స్ఛేంజ్ తెలంగాణా రిజిస్ట్రేషన్ 2024’ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం వారికి ఆ పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం అందుతుంటుంది.  ఈ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఉపాధిని కోరుకునే తెలంగాణలో నివసిస్తున్న యువకులందరూ ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్  https://employment. telangana.gov. in/LoginPage.aspx లో రిజిస్టర్ చేసుకోవాలి.  తొలుత  తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అధికారిక వెబ్‌పేజీకి వెళ్లండి. వెబ్‌సైట్ హోమ్‌పేజీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సైట్‌లోని కొత్త ఉద్యోగార్ధుల నమోదు బటన్‌ను క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ స్క్రీన్‌పైకి వస్తుంది. దానిలో  మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్రెస్ ప్రూఫ్, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేశాక.. దిగువన ఉన్న “రిజిస్టర్” బటన్‌ను నొక్కాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.

Also Read : Weather Report : సుర్రు షురూ..పెరిగిన ఉక్కపోత.. 35 డిగ్రీలు దాటిన టెంపరేచర్

ఇక మీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్డును(Employment Exchange 2024) డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా ఈజీయే.  తొలుత అధికారిక వెబ్‌సైట్‌ https://employment. telangana.gov.in/LoginPage.aspx కి వెళ్లండి. హోమ్‌పేజీలో ఉన్న లాగిన్ బటన్‌ను క్లిక్ చేయండి. తర్వాత మీ పాస్‌వర్డ్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. కొత్త పేజీలో కార్డ్ డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి. మీ పేరు, ఆధార్ నంబర్, ఇతర సమాచారంతో ఫామ్‌ను భర్తీ చేయండి. దిగువ మెనూ నుంచి “డౌన్‌లోడ్” ఆప్షన్ ఎంచుకోండి. ఆ వెంటనే కార్డ్ డౌన్‌లోడ్ కంప్లీట్ అవుతుంది. మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పోర్టల్ యొక్క అన్ని సేవలనూ వాడుకోవచ్చు.దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తారు.