Site icon HashtagU Telugu

TSC​​SB : ఫేక్ వెబ్‌సైట్ల లింకులు వస్తున్నాయా ? 8712672222కు వాట్సాప్ చేయండి

Telangana Cyber Security Bureau

Telangana Cyber Security Bureau

TSC​​SB : రాష్ట్ర ప్రజలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించే విషయంలో తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) సక్సెస్ అవుతోంది. సైబర్‌ నేరాల నియంత్రణకు టీఎస్‌సీఎస్‌బీ పకడ్బందీ చర్యలను అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సంస్థ ఎలా పనిచేస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అనుమానాస్పదమైన వెబ్‌‌సైట్ల లింకులు, ఫోన్‌ నంబర్ల నుంచి వచ్చే ప్రమాదకర మెసేజ్‌లపై ప్రజానీకం ఫిర్యాదులు చేసేందుకు టీఎస్‌సీఎస్‌బీ  8712672222 అనే వాట్సాప్‌ నంబరును ప్రారంభించింది. అనుమానాస్పద వెబ్‌సైట్ల లింకులు, ఫోన్ నంబర్లను మనం ఆ వాట్సాప్ నంబర్‌కు పంపాలి. అనంతరం వాటిని టీఎస్‌సీఎస్‌బీ  సైబర్ టీమ్(TSC​​SB) పరిశీలించి,  విశ్లేషిస్తుంది. అవి ప్రమాదకరమైనవా ? కాదా ? అనేది తేలుస్తుంది. ఒకవేళ అవి ప్రమాదకరమైనవే అయితే.. వాటిని శాశ్వతంగా పనిచేయకుండా నిర్వీర్యం చేస్తుంది.

Also Read : India Win : భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైలు నుంచి 8 మంది నేవీ మాజీ అధికారులు రిలీజ్

తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) గత సంవత్సరం సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 299 నకిలీ వెబ్‌సైట్లను నిర్వీర్యం చేసింది. ఇవన్నీ ప్రజల ఫోన్లు, ఈ-మెయిల్‌, సోషల్ మీడియా అకౌంట్లకు  వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌లతో ముడిపడిన వెబ్ లింకులే కావడం గమనార్హం. ఈవిధమైన చర్యల ద్వారా సైబర్ నేరాలు జరగకముందే నిలువరించే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీఎస్‌సీఎస్‌బీ వాట్సాప్ నంబరుకు ఇప్పటివరకు మొత్తం 1377 ఫిర్యాదులు అందగా.. వాటిలో ప్రమాదకర వెబ్ సైట్ల లింకులను నిర్వీర్యం చేయాలనే రిక్వెస్టులు 661 ఉన్నాయి. ఈ రిక్వెస్టుల ఆధారంగా 299 వెబ్ సైట్ల లింకులను టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేయకుండా చేసింది.

Also Read :  Lok Sabha Elections 2024: తెలంగాణలో బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్