Rajiv yuva vikasam: రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకంకు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పెంచిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తుంది. ఇందులో రాయితీని కల్పిస్తుంది.
Also Read: Minister Uttam Kumar: మంత్రి ఉత్తమ్ కుమార్ మంచి మనసు.. మెడికల్ కళాశాలపై వరాల జల్లు!
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు క్యాటగిరీలుగా విభజించింది. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు లోన్‌ను అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్లను మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీని కల్పిస్తుంది. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60 శాతం రాయితీ కల్పిస్తారు.
Also Read: Donald Trump: టారిఫ్ వార్.. చైనా నిర్ణయంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భయపడిందంటూ..
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుదారులకు విద్యా అర్హతలు ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదు. స్వయం ఉపాధితో బతకాలనుకునే వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అయితే, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మీ ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు గ్రామీణ ప్రాతాల్లో ఏడాదికి రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల ఆదాయం మించరాదు. ఆదాయం సర్టిఫికెట్ తీసుకొని మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన సమాచారం మండలాల్లోని ప్రజాపాలనా కేంద్రాల్లో తెలుసుకోవచ్చునని మల్లయ్య తెలిపారు.