KTR Vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయా ? ఆ వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందా ? కవిత, కేటీఆర్‌ల మధ్య పొలిటికల్ విషయాల్లో దూరం ఏర్పడిందా? అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వారసత్వాన్ని అందుకునేందుకు కవిత, కేటీఆర్‌లు పోటీపడటం అనేది సర్వసాధారణ విషయం. రాజకీయాల్లో పురుషులతో సమానంగా మహిళలూ రాణించగలరు. ఈ వాదనతో ఎవరూ విభేదించరు. ఇందిరాగాంధీ, రాణీ రుద్రమా దేవి లాంటి గొప్ప నాయకురాళ్లను మనదేశం ఇచ్చింది. కవితలోనూ గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆమెకు మాత్రం బీఆర్ఎస్ పగ్గాలను ఎందుకు అప్పగించకూడదు ? అని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అయితే వారిలో కొందరు ఇప్పుడే బయటికి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టు కొనసాగుతోంది.
Also Read :YSR Jagananna Colonies : జగనన్న కాలనీల బాగోతం బట్టబయలు.. అసలు నిజం ఇదీ
కవితకు అన్నీ సానుకూలతలే..
తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha) అమలుచేస్తున్న సామాజిక పోరాట కార్యాచరణను రాజకీయ పండితులు అభినందిస్తున్నారు. ఇదే తరహాలో ఆమె ముందుకుసాగితే తప్పకుండా తెలంగాణలో బలమైన రాజకీయ నేతగా ఎదుగుతారని చెబుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పగ్గాలు దక్కకపోయినా.. సొంత రాజకీయ పక్షం ఏర్పాటు చేసేంత నెట్‌వర్క్ కవితకు సమకూరొచ్చు. బీసీలకు రిజర్వేషన్ల అంశంలో, కులగణనపై కవిత చాలా క్లారిటీతో జనంలోకి వెళ్తున్నారు. భవిష్యత్తులో కవిత ఏ రకమైన రాజకీయ వైఖరిని తీసుకున్నా.. ఈ అంశం సానుకూలంగా పరిణమించే ఛాన్స్ ఉంటుంది.
Also Read :AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
క్లారిటీ ఇచ్చిన హరీశ్ రావు
‘‘కేటీఆర్, కవిత మధ్య విభేదాలు లేవు. అదంతా తప్పుడు ప్రచారం. మా పార్టీ అంటే గిట్టని వాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలో సమస్యలు సృష్టించాలని చూస్తున్న వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్, కవిత మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదు. నేటి రాజకీయాల్లో నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. గతంలో బీఆర్ఎస్ గురించి కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలే జరిగాయి. మొదట్లో ప్రజలు వాటిని నమ్మారు. అయితే ఏడాది కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత, ప్రజలు ఇప్పుడు రెండు ప్రభుత్వాల పాలనను పోల్చుకుంటున్నారు. తేడాను గ్రహిస్తున్నారు. వాస్తవం తెలిసినప్పుడు, నిజం నిలబడుతుంది. ఈ వివాదాల వెనుక ఉన్న నిజం త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది’’ అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.