Site icon HashtagU Telugu

Free Bus scheme : తెలంగాణలో ఆర్టీసీ బస్సు లను ఇలా కూడా వాడుతున్నారా..? దేవుడా..!!

Free Bus Leady

Free Bus Leady

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ముందుగా మహిళలకు ఉచిత బస్సు (Free Bus Scheme) సౌకర్యాన్ని కల్పించి మహిళల్లో ఆనందం నింపింది. ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళలు అనేక విధాలుగా వాడుకుంటున్నారు. దీనికి సంబదించిన వీడియో ప్రతి రోజు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వీడియో చూసి నవ్వుకునే వాళ్లు ఉన్నారు..తిట్టుకునే వాళ్లు ఉన్నారు..ఇలా కూడా వాడుకుంటారా అని మాట్లాడుకున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది టైం పాస్ కోసం ప్రయాణం చేస్తున్నారు..మరికొంతమంది ఇంట్లో ఉండి ఏంచేయాలో అర్ధం కాక సిటీ కి వెళ్లి వస్తూ ఉన్నారు. ఇలా నిత్యం బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మగవారు ప్రయాణం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగానే ఓ వీడియో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఓ తల్లి బస్సు లో ఏకంగా చీర తో ఉయ్యాల కట్టి తమ బిడ్డను అందులో వేసి ఊపుతున్న వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు రేయ్..?ఎటు పోతుందిరా తెలంగాణ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మంచి చేద్దామని ఈ పథకాన్ని తీసుకొస్తే..మీరు పథకం పరువు తీస్తున్నారు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆడవారు పిల్లడు అన్నం తినడం లేదని చెప్పి బస్సు లో తిప్పుతూ తినిపిస్తున్న అంటుంది..ఇంకొందరేమో బస్సు లో టైం పాస్ కావడం లేదని బస్సు ప్రయాణం అంటున్నారు. ఇలా మీరు చేసే వృధా ప్రయాణం వల్ల ఆ టికెట్ భారం మనపైనే పడుతుందని..ప్రభుత్వం మన నుండి ఆ డబ్బులు వసూళ్లు చేస్తుందని..ఇది గమనించి.వృధా ప్రయాణం మానుకోండి..ఏదైనా అవసరం ఉంటేనే ప్రయాణం చెయ్యండి అంటూ కోరుతున్నారు.

Read Also : Train Derailed: ఢిల్లీ-హౌరా మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..