Site icon HashtagU Telugu

Telangana Jagruti: ఎమ్మెల్సీ క‌విత కీల‌క నిర్ణ‌యం.. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి!

Telangana Jagruti

Telangana Jagruti

Telangana Jagruti: తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థ బలోపేతంలో భాగంగా పలు అనుబంధ విభాగాలు, 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యత

తెలంగాణ జాగృతి సంస్థాగత పదవులలో మొదటి నుంచి సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని కవిత పేర్కొన్నారు. కొత్తగా నియమించిన 11 జిల్లా అధ్యక్షులలో ఐదుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లో కూడా ఈ ప్రాధాన్యత కొనసాగిందని ఆమె తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు సంస్థ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Also Read: Kishtwar Cloudburst: జ‌మ్మూ కశ్మీర్‌లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్‌.. 46 మంది మృతి!

కొత్తగా నియమించబడిన బాధ్యులు

కొత్తగా నియమించబడిన జిల్లా అధ్యక్షులు