Site icon HashtagU Telugu

Warangal NIT Jobs : నెలకు లక్షన్నర దాకా శాలరీ.. వరంగల్ నిట్‌లో 56 నాన్‌ టీచింగ్ జాబ్స్

Warangal Nit Jobs Non Teaching Posts Warangal

Warangal NIT Jobs : బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ వంటి విద్యార్హతలు కలిగిన వారికి ఇదే మంచి అవకాశం. వరంగల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (NIT)  డైరెక్ట్‌ / డిప్యుటేషన్‌ ప్రాతిపదికన  56 నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు జనవరి 7వ తేదీలోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చు. గ్రూప్‌-ఎ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.1000.  గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిన్సిపల్ సైంటిఫిక్‌ / టెక్నికల్‌ ఆఫీసర్‌

ఈ పోస్టులు 3 ఉన్నాయి.   వీటిలో రెండు అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. 1 ఓబీసీలకు(Warangal NIT Jobs) రిజర్వ్ చేశారు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ పాసైన వారు అప్లై చేయొచ్చు. పని అనుభవం కూడా ఉండాలి.  56 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. శాలరీ నెలకు రూ.1.44 లక్షల దాకా ఇస్తారు. డీఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎఎస్‌)

ఈ పోస్టు 1 మాత్రమే ఉంది. ఇది అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.  పని అనుభవం కూడా ఉండాలి. 56 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. శాలరీ నెలకు రూ.1.44 లక్షల దాకా ఇస్తారు. డీఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Also Read :Suchir Balaji : ‘ఓపెన్ ఏఐ’పై దావా.. మరుసటి రోజే సుచిర్ బాలాజీ సూసైడ్.. ఏం జరిగింది ?

Also Read :One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ