Pawan Kalyan meets Revanth Reddy : తెలంగాణ సీఎం తో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ

AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పవన్.. ఆయనకు రూ. కోటి చెక్కును అందించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Pawan Kalyan Meets Cm Re

Cm Pawan Kalyan Meets Cm Re

AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..బుధువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో భేటీ అయ్యారు. ఇటీవల భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లోని ఖమ్మం , మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు విరాళాలు అందజేస్తూ ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. సినీ , బిజినెస్ , రాజకీయ నేతలు ఇలా అనేక రంగాలవారు విరాళాలు అందజేస్తుండగా..ఏపీ డిప్యూటీ సీఎం , సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన వంతుగా కోటి రూపాయిలు ప్రకటించారు.

హైడ్రా (Hydra) ఫై పవన్ (Pawan Kalyan) పాజిటివ్ కామెంట్స్

తాను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి చెక్ ను అందజేస్తున్నానని ప్రకటించారు. ప్రకటించినట్లే ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కి చెక్ ను అందజేశారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన పవన్.. ఆయనకు రూ. కోటి చెక్కును అందించారు. అనంతరం ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా ఫై కూడా పవన్ అభినందించినట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని సూచనలు కూడా సూచించారని వినికిడి. పలు సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్..సీఎం రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా ఫై పాజిటివ్ కామెంట్స్ చేసారు. ఇలాంటి వ్యవస్థ తీసుకురావాలంటే చాల ధైర్యం అవసరమని..ఏపీలో ఇలాంటి వ్యవస్థ తీసుకురావాలంటే కష్టం అని తెలిపారు.

ముంపు గ్రామాలకు రూ.4 కోట్లు (Pawan Kalyan Donates Rs.4 crore to flood-hit villages)

ఇక ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా పవన్ కళ్యాణ్ కోటి విరాళం ప్రకటించారు. అంతే కాదు 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడడంతో ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు అందజేస్తున్నారు.

Read Also : Turmeric: పసుపు ఎక్కువగా వాడితే కడుపునొప్పి వస్తుందా.. ఇందులో నిజమెంత?

  Last Updated: 11 Sep 2024, 11:37 AM IST