ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)..కేసీఆర్ (KCR) నివాసానికి చేరుకున్నారు. గత నెలలో కేసీఆర్ తన ఫాం హౌస్ లో కింద పడటంతో
ఆయన తుంటి ఎముకకు గాయం అయింది. దీంతో యశోద వైద్యులు సర్జరీ చేసి సరి చేసారు. దాదాపు వారం రోజులు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్…ఆ తర్వాత నందినగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక సీఎం ప్రమాదానికి గురై హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటుగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆ సమయంలోనే ఏపీ సీఎం జగన్ పరామర్శకు వెళ్లాలని భావించారు. కానీ, ఎక్కువ మంది రావటం ద్వారా ఆపరేషన్ చేసిన సమయంలో కేసీఆర్ కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఆగిపోయారు. ఇక ఇప్పుడు కేసీఆర్ ను పరామర్శించేందుకు ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బేగం పేట్ కు చేరుకున్న జగన్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు స్వాగతం పలికారు. అనంతరం నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్..దగ్గరుండి జగన్ ను ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం జగన్ కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తరువాత తొలి సారి జగన్ కలవడం జరిగింది. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తో సత్సంబంధాలు కొనసాగించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేత అయ్యారు. ఈ సమయంలో జగన్..కేసీఆర్ ను కలవడం రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!