Site icon HashtagU Telugu

Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల

India

India

Postal GDS Recruitment : తపాలా శాఖలో జాబ్స్‌కు అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్. పోస్టాఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని పదోతరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. జాబ్స్‌కు ఎంపికైన వారి పేర్లతో కూడిన మొదటి జాబితాను ఇంతకుముందే విడుదల చేశారు. తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.

Also Read :BMW Bikes : ‘బీఎండబ్ల్యూ మోటారాడ్’, ‘రీవోల్ట్’ కంపెనీల నుంచి సరికొత్త బైక్స్

రెండో లిస్టులో 22,416 మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. ఇండియా పోస్ట్ వెబ్‌సైటులో దీనికి సంబంధించిన పీడీఎఫ్ అందుబాటులో ఉంది. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో కేవలం మార్కుల, రిజర్వేషన్ ఆధారంగా ఈ జాబ్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. రెండో లిస్టులో ఏపీ నుంచి 664 మందిని, తెలంగాణ నుంచి 468 మందిని ఎంపిక చేశారు. వారిని ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానించనున్నారు.  ఈ  లిస్టులో ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 3లోగా ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఎంపికయ్యే  అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు. కాగా, ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఏపీ పరిధిలో మొత్తం 1,355 పోస్టులను, తెలంగాణ పరిధిలో మొత్తం 981 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Also Read :Anil Ambani : అనిల్ అంబానీకి మంచిరోజులు.. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరుకు రెక్కలు

పోస్టును బట్టి ఈ జాబ్స్‌కు ఎంపికైన వారికి  రూ.10,000 – రూ.12,000 దాకా శాలరీ ఇస్తారు. రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే చాలు. రోజువారీ విధులు నిర్వర్తించడానికి అవసరమైన కంప్యూటర్, ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. పోస్టాఫీసుకు దగ్గర్లో ఇల్లు ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు పార్ట్ టైం జాబ్ కోసం వెతికే వారికి ఈజాబ్ మంచి అవకాశం. ఈ జాబ్ చేస్తూ అదనపు విద్యార్హతలను సంపాదించుకోవచ్చు. గ్రూప్స్, సివిల్స్ లాంటి జాబ్స్‌ కోసం ప్రిపేరై పరీక్షలు రాయొచ్చు. ఎందుకంటే రోజూ తగినంత సమయం మిగులుతుంది.