Site icon HashtagU Telugu

Azharuddin : హెచ్‌సీఏ కేసులో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్

Azharuddin

Azharuddin

కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు మల్కాజిగిరి మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కి చెందిన రూ.3.85 కోట్ల దుర్వినియోగానికి సంబంధించి మల్కాజిగిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అక్టోబర్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. అందులో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసుల్లో అజారుద్దీన్ షరతులతో కూడిన బెయిల్ పొందారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత అజారుద్దీన్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సిఆర్‌పిసి సెక్షన్ 41 (ఎ) కింద నోటీసులు అందజేయాలని ఉప్పల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు సహకరించాలని అజారుద్దీన్‌కు కోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉన్న అజారుద్దీన్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌పై కేసులు ఉండ‌టంతో నామినేష‌న్ వేయ‌డానికి అడ్డంకిగా మారాయి. దీంతో అజారుద్దీన్ మ‌ల్కాజ్‌గిరి కోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. కోర్టు బెయిల్ ఇచ్చింది. నామినేష‌న్‌కు క్లియ‌ర్ అవ్వ‌డంతో అజారుద్దీన్ త్వ‌ర‌లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయ‌నున్నారు.