Maoists : మ‌వోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా మూలుగులో వెలిసిన క‌ర‌ప‌త్రాలు.. మ‌మ్మ‌ల్ని బ్ర‌త‌క‌నివ్వ‌డి అంటూ..!

ఆదివాసీ-గిరిజన సంఘాల‌ ఐక్య వేదిక పేరుతో మూలుగులో మావోయిస్టు వ్యతిరేక కరపత్రాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ములుగు

Published By: HashtagU Telugu Desk
maoist

maoist

ఆదివాసీ-గిరిజన సంఘాల‌ ఐక్య వేదిక పేరుతో మూలుగులో మావోయిస్టు వ్యతిరేక కరపత్రాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం, పాలెం, పత్రాపురం ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా క‌ర‌ప‌త్రాలు వెలిశాయి.దీంతో గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.‘మాకు మావోయిస్టు పార్టీ వద్దు, మమ్మల్ని బతకనివ్వండి’ అని కరపత్రాల్లో పేర్కొన్నారు. కరపత్రాలు ఎవ‌రు వేశారో తెలియ‌క ఏజెన్సీ గ్రామాల ప్ర‌జ‌ల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆదివాసీ సంస్థల పేరుతో గ్రామాల్లో కరపత్రాలు దర్శనమివ్వడం వెనుక పోలీసు అధికారుల హస్తం ఉందని, దీంతో గిరిజ‌న ప్రజ‌లు భయాందోళనకు గురవుతున్నారని ప్రజాసంఘాల సభ్యులు ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దిరోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పుల్లా కరుణాకర్ వివిధ మావోయిస్టు ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, ములుగు ఎస్పీ గౌస్ ఆలం, OSD అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలపై సమావేశంలో చర్చించారు. మావోయిస్టులు, వారి సానుభూతిపరుల కదలికలపై నిఘా పెంచేందుకు జిల్లాల పోలీసు అధికారులు కూడా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.

Also Read:  CM KCR : కేసీఆర్ కు షాక్.. 42 సెగ్మెంట్లపై ‘బాబు’ ఎఫెక్ట్

  Last Updated: 03 Oct 2023, 09:08 AM IST