Ragging: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలి!

మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణాన్ని మరువకముందే, మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

  • Written By:
  • Updated On - February 27, 2023 / 03:48 PM IST

దేశ భవిష్యత్తుకు బాటలు వేసే యువత ర్యాగింగ్ (Ragging) కోరల్లో చిక్కుకుంటున్నారు. సినిమాల వ్యామోహమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ర్యాగింగ్ కారణంగా అర్దాంతరంగా చనిపోతున్నారు. మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణాన్ని మరువకముందే, మరో విద్యార్థిని అయిన ఇరవై ఏళ్ల రక్షిత (Rakshita) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైబల్ స్టూడెంట్ అయిన సీనియర్ విద్యార్థిని ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత. నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతోంది. సీనియర్లలో ఒకరు మరొక విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమెను వేధించడం (Ragging) మొదలుపెట్టారు. దీంతో విసుగు చెందిన రక్షిత వరంగల్‌లోని బంధువుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఇంట్లో ఆమె మృతదేహం దొరకడంతో కన్నీరి మున్నీరు అవుతున్నారు.

వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో మెడికో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి (26) ఆదివారం రాత్రి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరణించింది. Md సైఫ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరూ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. మట్టెవాడ పోలీసులు గత శుక్రవారం సైఫ్‌ను అరెస్టు చేశారు. అతనిపై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. PG అనస్థీషియాలో చేరిన ఒక నెల తర్వాత, డిసెంబర్ 2022 నుండి సైఫ్ ప్రీతిని వేధిస్తున్నట్లు (Ragging) పోలీసుల విచారణలో తేలింది.

Also Read: D. Srinivas: డి. శ్రీనివాస్ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!