గత కొద్దీ రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ(రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెజ్ టెక్నాలజీ, RGUKT) (IIIT Basar)లో విద్యార్థుల ఆత్మహత్యలు (Students Suicide) ఆగిపోవడంతో హమ్మయ్య అనుకున్నారంతా..కానీ ఈరోజు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పీయూసీ రెండో ఇయర్ చదువుతున్న నిజామాబాద్‌లోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్వాతి ప్రియా (Swathi Priya) ఆత్మహత్య (Suicide ) చేసుకుంది. ఆమె రూమ్‌లో సూసైడ్ నోట్ ఒకటి లభ్యమైంది. దాన్ని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని ఆర్జియుకేటి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈరోజు నుండి ఆమెకు పరీక్షలు ఉన్నాయి..అయితే పరీక్షల రోజే ఆత్మహత్యకు పాల్పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతితో ట్రిపుల్ ఐటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వాతి ఆత్మహత్య విషయాన్నీ ఆమె తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం తెలియజేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి కొత్తమీ కాదు..ఎప్పటి నుండి జరుగుతూ వస్తున్నాయి. విద్యార్థులపై అధిక విద్యా ఒత్తిడి ఉందని, కఠినమైన అకడమిక్ షెడ్యూల్, అంచనాలు వాటిని అధిగమించే సామర్థ్యం లేకపోవడం విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు , విద్యార్థి సంఘాలు వాపోతున్నారు. మానసిక ఆరోగ్య సదుపాయాలు, కౌన్సెలింగ్ సదుపాయాలు తగినన్ని లేవని పలువురు సూచిస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, భయం, నిరాశ వంటి భావాలను తగ్గించే మానసిక సహాయం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతుందని చెపుతున్నారు. కొంతమంది విద్యార్థులు కుటుంబ, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు.
విద్యాసంస్థలు కౌన్సెలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తరచుగా కౌన్సెలింగ్ సెషన్స్, మానసిక ఆరోగ్య సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులను మానసికంగా బలోపేతం అవుతారని , విద్యా కోర్సుల సరళీకరణ, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా వారి వ్యక్తిగత అభిరుచులకు తగ్గ శిక్షణ ఇవ్వడం వంటి మార్గాలు అనుసరిస్తే ఇలా ఆత్మహత్యలు చేసుకరాని సూచిస్తున్నారు.
Read Also : Ram Gopal Varma : చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై కామెంట్స్.. రామ్‌గోపాల్ వర్మపై కేసు