హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో రోజు రోజుకు ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కూలి పనుల దగ్గరి నుండి ఉద్యోగం , వ్యాపారాలు , హోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇలా ఎన్నో రకాల వారు ప్రతి రోజు నగరంలో అడుగుపెడుతున్నారు..దీంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య ను కంట్రోల్ చేసేందుకు ఎన్ని fly over బ్రిడ్జి లు కట్టిన సమస్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో స్కైవాక్ (SkyWalk)ను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధం అవుతుంది.
పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds) మెట్రో స్టేషన్ వద్ద ఈ కొత్త స్కైవాక్ ను ఏర్పాటు చేయబోతుంది. మెట్రో ఫ్లైఓవర్ కారణంగా ప్రయాణికులు, పాదాచారులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులకు పడుతుండడం తో జీహెచ్ఎంసీ(GHMC) స్కైవాక్ ద్వారా ఈ సమస్యను తొలగించాలని చూస్తుంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో పరేడ్ గ్రౌండ్స్ జంక్షన్ ఒకటి. రహదారి దాటి రెండోవైపు రావాలంటే చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుండటంతో.. ఇక్కడ స్కైవాక్ నిర్మించబోతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వద్ద ఓ స్కైవాక్ నిర్మించగా.. ఇప్పుడు మరోటి అందుబాటులోకి రాబోతుంది.
స్కైవాక్ అనేది నగరాల్లో పాదచారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిర్మాణం. ఇది రహదారుల మాధ్యమంగా పాదచారులు సులభంగా దాటడానికి, ట్రాఫిక్ మరియు ఇతర ఆటంకాలను వదులుకొని, ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.