KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు

KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ […]

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ సీనియర్ కేకే, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా, తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆమె కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారు వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమంట్ ఎన్నికల ముందు ఏం చేయాలో తోచడం లేదు. ఇక బీఆర్ఎస్ అధినేత త్వరలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేసీఆర్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

  Last Updated: 29 Mar 2024, 10:25 AM IST