MallaReddy : మల్లారెడ్డి కి మరో షాక్..

కాలేజీ ల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 11:56 AM IST

బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి (MallaReddy) కి వరుస షాకులు తగులుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం , మరోపక్క ఐటీ అధికారులు ..ఇలా రెండు పక్కల దాడులతో మల్లారెడ్డి నిద్ర కూడా పోవడం లేదు. ఎప్పుడు ఏంజరుగుతుందో అని టెన్షన్ పడుతూ వస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల భూములను అక్రమంగా ఆక్రమించుకొని కాలేజీలు కట్టారని ఆరోపణల నేపథ్యంలో కూల్చివేతలు జరపగా..ఇక ఇప్పుడు తన కాలేజీ ల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు… వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలేజీ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. బంధువుల పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం.

Read Also : Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. థియేటర్ లోకి రాబోతున్న మగధీర!