Chevella Mla: కేసీఆర్‌కు మరో షాక్…. చేవెళ్ల ఎమ్మెల్యే గుడ్‌ బై

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Gh5zzunwsaafugj

Gh5zzunwsaafugj

Kale Yadaiah: బీఆర్ఎస్‌కు (BRS) మరో షాక్ (Shock) తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు (Mla’s) కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే (Chevella Mla) కాలె యాదయ్య కారు దిగి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో (Delhi) సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో (Revanth Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరారు కాలె యాదయ్య (Kale Yadaiah). దీంతో బీఆర్ఎస్ (Brs Shocks) మరో వికెట్ కోల్పోయింది.

అయితే.. పార్టీని వీడుతున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలతో…ఎలాంటి నష్టం లేదన్నారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ (Kcr). పార్టీలోకి లీడర్లు వస్తుంటారు..పోతుంటారని తెలిపారాయన. ఈ ఫిరాయింపులతో బీఆర్ఎస్‌లో (BRS MLA) మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు కేసీఆర్. పార్టీ అనేది… నాయకులను క్రియేట్ (Create) చేస్తుందన్నారు. ఇంకా బీఆర్ఎస్‌లో బుల్లెట్ల (Bullets) మాదిరి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. వారినే నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ (Cm Revanth) రెడ్డితో టచ్‌లో ఉన్నారు. తమ స్వ ప్రయోజనాల కసం ఎలాగైనా బీఆర్ఎస్ (BRS) పార్టీని వీడి…కాంగ్రెస్ లో చేరి ఏదో ఒక పదవిని తెచ్చుకోవాలని చాలా మంది చూస్తున్నారు.

  Last Updated: 28 Jun 2024, 04:28 PM IST