Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ముడిపడిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. త్రిపుర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా అప్పట్లో ట్యాప్ చేయించారని పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. 2023 సంవత్సరం నవంబరు 15 నుంచి నవంబరు 30 మధ్య ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు తేలింది. 2023 అక్టోబరు 26న ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా(Phone Tapping Case) నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించడం గమనార్హం.
Also Read :Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌కు చిట్టడవి ఊపిరి
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకుగానూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్ రావు బృందం ధ్వంసం చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వారిని అక్కడి నుంచి భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ సీఐడీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే భారత విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి వినతి పంపింది. ప్రభాకర్, శ్రవణ్‌లకు భారత్‌కు అప్పగించాలని కోరింది. అమెరికా, భారత్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా అప్పగింత జరిగే అవకాశం ఉంది. అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చు.
Also Read :Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏ4 నిందితుడు ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేసినందున.. కేసీఆర్ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఈ కేసుతో ముడిపడిన విచారణకు కేంద్ర సర్కారు వైపు నుంచి సహకారం లభించే ఛాన్స్ ఉంటుంది.