New Scheme : తెలంగాణ లో నేడు మరో పథకం అమలు

New Scheme : ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం రూ. 10,665 కోట్లను కేటాయించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం

Published By: HashtagU Telugu Desk
Sanna Biyyam Distribution I

Sanna Biyyam Distribution I

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ (Sanna Biyyam Distribution) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించనున్నారు. రాష్ట్రంలో అర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఎంతో ఉపయోపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Summer Holidays : నేటి నుంచి వేసవి సెలవులు

ఈ పథకం ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 85 శాతం మందికి లబ్ధి కలుగనుంది. మొత్తం 3.10 కోట్ల మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రతను పెంపొందించేందుకు మరియు పేదవర్గాలకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం నూతన చర్యలను తీసుకుంటోంది. నెలకు 1.80 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా పేద ప్రజలకు మెరుగైన ఆహార భద్రత లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Ikea ​​Marriage Test : ఐకియా మ్యారేజ్ టెస్ట్ గురించి తెలుసా ?

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం రూ. 10,665 కోట్లను కేటాయించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి, పేదలకు ఉచితంగా బియ్యం అందించడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ఈ చర్య ప్రజల జీవితాల్లో హితకర మార్పులను తెస్తుందని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

  Last Updated: 30 Mar 2025, 11:54 AM IST