Site icon HashtagU Telugu

TSPSC Paper Leak : ‘న్యూజిలాండ్’ దాకా పేపర్ లీక్.. మరో అరెస్ట్ ఎవరిదో తెలుసా ?

TGPSC NEW UPDATE

TSPSC Paper Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎస్/సిట్ పోలీసులు న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన 31 ఏళ్ల సాన ప్రశాంత్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరీ ప్రశాంత్ ? అంటే.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌ రెడ్డికి స్వయానా బావమరిది!! న్యూజిలాండ్‌లో జాబ్ చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్‌‎‌కు గ్రూప్ 1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌ రెడ్డి చేరవేసి పరీక్ష రాయించాడని దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను కీలక నిందితులుగా గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో దాదాపు 100 మందిని అరెస్టు చేశారు.   

We’re now on WhatsApp. Click to Join.

న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు సిట్‌ పోలీసులు చాలాసార్లు నోటీసులు పంపారు. అయితే అతడి నుంచి జవాబు రాలేదు. దీంతో పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితమే నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో దిగగానే.. విమానాశ్రయ సిబ్బంది నుంచి సమాచారం అందడంతో సిట్‌ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రశాంత్‌‌కు కోర్టు రిమాండ్‌ విధించగా చంచల్‌గూడ జైలుకు(TSPSC Paper Leak) తరలించారు.

Also Read: Delhi Schools : 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత.. 6 నుంచి 10 తరగతులకు వర్చువల్ క్లాస్‌లు