Site icon HashtagU Telugu

Gutta Sukhender Reddy : నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కీలక నేత ?

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy

Gutta Sukhender Reddy : ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్‌ వేగంగా మారుతున్నాయి. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్‎లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బీఆర్ఎస్‌లో ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని భావించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భావించారు. తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో నల్లగొండ, మునుగోడుల నుంచి తనయుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు సుఖేందర్ రెడ్డి ట్రై చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటు గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukhender Reddy).. అటు గుత్తా అమిత్ రెడ్డి.. నల్గొండ లేదా భువనగిరి స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు. అయితే అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కంటే కామ్‌గా ఉండటమే గౌరవప్రదమని గుత్తా భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని ఆయన కేటీఆర్‎కు స్పష్టం చేశారట. అందుకే గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‎లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : Tamannah : 19 ఏళ్ల కెరీర్ లో అతనిలాంటి వాడిని చూడలేదు..!

తాజాగా హైదరాబాద్‎లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గుత్తా అమిత్ రెడ్డి కలిశారు.  బీఆర్ఎస్‎ను వీడి కాంగ్రెస్‎లో చేరే అంశాన్ని మంత్రితో అమిత్ చర్చించినట్లు సమాచారం. భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోమటిరెడ్డిని కోరారట. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న అమిత్‎కు నల్లగొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమిత్‎కు భువనగిరి టికెట్ అంతా ఈజీ కాదట. భువనగిరి టికెట్‎ను సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆశిస్తున్నారు. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉన్న వారికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Also Read :Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్.. లక్కీ ఛాన్స్..!