Telangana: డిసెంబర్ లో అద్భుతం జరగబోతుంది

ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబందించిన ఎన్నికల తేదీలను ప్రకటించింది. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు

Telangana: ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబందించిన ఎన్నికల తేదీలను ప్రకటించింది. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ‌లో 119, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజ‌స్థాన్‌లో 200, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయంతోనే కాంగ్రెస్ ఆ ఆరు హామీలను ప్రకటించిందని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనతో అద్భుతం జరిగిందని గుర్తు చేశారు . వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో మరో అద్భుతం జరగనుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుంది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను పీడిస్తున్నది. రాష్ట్ర సెక్రటేరియట్ భవనంలో చోరీ జరిగిందని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ప్రజా ధనాన్ని దోచుకుంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో సంపదను పెంచి పేదలకు పంచాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ అన్నారు.

Also Read: KTR: దక్షిణ భారత్ లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారు: మంత్రి కేటీఆర్