Site icon HashtagU Telugu

Farmer Suicide : ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు

Another Farmer Suicide

Another Farmer Suicide

కీలక ముగ్గురు మంత్రులు..అదికూడా కీలక శాఖలకు సంబదించిన మంత్రుల ఉన్న ఖమ్మం ఇలాకాలో రైతుల ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రతి రోజు రైతు ఆత్మహత్య..లేదా ఆత్మహత్యాయత్నం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. కొంతమంది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది భూ అక్రమాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య (Darmer suicide in khammam district) చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తమగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై విపక్ష పార్టీలు అధికార పార్టీ ఫై విమర్శలు, ఆరోపణలు చేస్తుంది.

ఇదిలా ఉండగానే ఈరోజు మరో ఆత్మ హత్య యత్నం ప్రభుత్వం ఫై మరింత విమర్శలు కురిపిస్తుంది. ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సాహసించాడు. గ్రామంలో తన భూమిని ఆక్రమించారని పచ్చిపాల భద్రయ్య అనే రైతు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇల్లందు ఆసుపత్రికి, అక్కడ నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుండడం తో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటన ఫై ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం.
ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం గారి సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలు మరువక ముందే నేడు ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదు.

పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

Read Also : CJI – Stock Markets : బీ అలర్ట్.. రాకెట్ స్పీడుతో స్టాక్ మార్కెట్లు : సెబీకి సీజేఐ సూచన