ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఐడీ డీఎస్పీ భీంరెడ్డి వద్ద దొరికిన డబ్బు, బంగారం, వెండి, ఆస్తులు, భూముల పత్రాలు, ఫ్లాట్ల పత్రాలు చూసి.. ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం నుంచి భీంరెడ్డి ఇళ్లు, అతడి బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. […]

Published By: HashtagU Telugu Desk
Another 'corrupt whale' caught in the ACB net: Bundles of cash and gold found at DSP Bhimreddy's house.

Another 'corrupt whale' caught in the ACB net: Bundles of cash and gold found at DSP Bhimreddy's house.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఐడీ డీఎస్పీ భీంరెడ్డి వద్ద దొరికిన డబ్బు, బంగారం, వెండి, ఆస్తులు, భూముల పత్రాలు, ఫ్లాట్ల పత్రాలు చూసి.. ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం నుంచి భీంరెడ్డి ఇళ్లు, అతడి బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. మరో 2 రోజుల పాటు ఈ తనిఖీలను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డీఎస్పీ భీంరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన బంధువుల ఇళ్లలో దాడులు కొనసాగిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే సోదాలు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ భీంరెడ్డికి 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా ఇంట్లో 2 కిలోల బంగారం.. 20 కిలోల వెండి.. రూ.3.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆయన బంధువుల ఇళ్లల్లో రూ.40 లక్షలు సీజ్ చేశారు.

నార్సింగిలోని వేసెల్లా మెడోస్ విల్లాలో 2 ఏసీబీ టీమ్‌లు సహా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు.. రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, జహీరాబాద్, వికారాబాద్, మోమిన్‌పేట్‌లలో బినామీల పేర్ల మీద భీంరెడ్డి భారీగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. మోమిన్‌పేట్‌లో భీంరెడ్డి ఫ్రెండ్ పేరు మీద ఫాంహౌస్.. గచ్చిబౌలిలో అతడి కూతురు పేరు మీద ఒక అపార్ట్‌మెంట్.. కర్ణాటక రాజధాని బెంగళూరులో బంధువు పేరు మీద ఎకరా స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తొలిరోజే భారీగా ఆస్తులు దొరకడంతో.. ఈ సోదాలు మొత్తం పూర్తి అయితే.. భీంరెడ్డి ఆస్తులు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన భీంరెడ్డి.. భారీగా అక్రమాస్తులను పోగు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఎక్కువ కాలం హైదరాబాద్‌లో భీంరెడ్డి వివిధ హోదాల్లో పనిచేయడంతో.. అనేక వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకుని.. అక్రమ సంపాదన చేసినట్లు తెలుస్తోంది. సీఐగా ప్రమోషన్ పొందిన తర్వాత.. రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి వంటి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఆ తర్వాత డీఎస్పీగా ప్రమోషన్ అందుకుని.. పటాన్ చెరు డివిజన్‌లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా భీంరెడ్డి పనిచేస్తున్నారు.

  Last Updated: 03 Jul 2026, 12:06 PM IST