Site icon HashtagU Telugu

BRS : ‘బండ్ల’ బాటలో మరికొంతమంది బిఆర్ఎస్లోకి..?

Bandla Join Brs

Bandla Join Brs

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishna Mohan Reddy)..ఈరోజు సొంత పార్టీ బిఆర్ఎస్ (BRS) లోకి చేరారు. ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన ఆయన మంగళవారం కేటీఆర్​(KTR)తో సమావేశమై పలు అంశాలపై చర్చించి.. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు. కేవలం ఈయన మాత్రమేనా..? లేక మిగతా నేతలు కూడా తిరిగి సొంత గూటికి చేరతారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవులు అనుభవించిన నేతలు..సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ని వీడడం స్టార్ట్ చేసారు. కీలక నేతలు కేసీఆర్ ను కాదని చెప్పి కాంగ్రెస్ లో చేరి..ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని ఈరోజు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవిచూడడంతో మిగతా నేతలంతా కాంగ్రెస్ బాట పట్టారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలే కాదు బిఆర్ఎస్ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది కాంగ్రెస్ లో చేరి..బిఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారంతా తిరిగి బిఆర్ఎస్ లోకి వెళ్లాలని భావిస్తున్నారట. దీనికి కారణం కాంగ్రెస్ నేతలతో పడకపోవడం..అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీఫై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. దీనిని గమనించే బిఆర్ఎస్ నుండి వచ్చిన నేతలు తిరిగి సొంతగూటికి వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా వాళ్లు కూడా తిరిగి బిఆర్ఎస్ లోకి వెళ్తారా..లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ..బిఆర్ఎస్ లో చేరారు. బీఆర్​ఎస్​ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వెళ్లిన అయన మంగళవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్​మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్​ను కలుస్తానని అన్నారు.

Read Also : IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్