Site icon HashtagU Telugu

BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?

Brs Mlcs

BRS MLCs : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొంతసేపు చర్చించినట్లు సమాచారం. సారయ్యతో పాటు మరో ఐదారుగురు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను(BRS MLCs) కూడా కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నుంచి వలసలు జరగగా.. ఈనాడు కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ నుంచి వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్యలు కాంగ్రెస్‌లో చేరారు. ఆగస్టు నెలలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్

ఈనేపథ్యంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరుతున్న ప్రజాప్రతినిధులందరి వివరాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఈవిషయాన్ని ఇటీవలే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణలో జరుగుతున్న ఈ వ్యవహారానికి రాహుల్ గాంధీ ఎలా మద్దతు ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. మేం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. న్యాయపోరాటం చేస్తాం’’ అని తెలిపారు.

గAlso Read :10 Avatars : మహాశివుడి పది అవతారాల గురించి తెలుసా..

Exit mobile version