Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే

Telangana (31)

Telangana (31)

Telangana: ఎన్నికల వేడి రోజురోజుకి ముదురుతుంది. వచ్చే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. బోథ్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపరావు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది.

బీఆర్ఎస్ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావును పక్కన పెట్టి అనిల్ జాదవ్‌కు సీటు కేటాయించింది. దీంతో ఆయన బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు .బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల విడుదల చేశారు . తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థుల వివరాలను తెలిపారు. అయితే ఏడు స్థానాల్లో మార్పులు చేశారు.

ఈసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుభాస్‌రెడ్డి – ఉప్పల్‌, రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్‌, రాములు నాయక్‌ – వైరా, రేఖా నాక్‌-ఖానాపూర్‌, చెన్నమనేని రమేష్‌ – వేములవాడ, గంప గోవర్ధన్‌ – కామారెడ్డి, రాథోడ్‌ బాపురావు – బోథ్‌, వీరికి పార్టీ టికెట్లు కేటాయించలేదు. రేఖా నాయక్ ఈ మధ్యే కాంగ్రెస్ లోకి వెళ్ళింది. మునుముందు బీఆర్ఎస్ ని వీడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: Natural Star Nani : నాని కెరీర్ బెస్ట్ రెమ్యునరేషన్..!