Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సాయం

Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 02:50 PM IST

Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో దీనికోసం కేటాయింపులు చేస్తామని చెప్పారు.  రెండో రోజైన శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేదికగా ఈ ప్రకటన చేశారు. ఇవాళ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య ఆటో కార్మికుల సమస్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు ఈ గుడ్ న్యూస్ వినిపించారు.

We’re now on WhatsApp. Click to Join

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సమర్థిస్తూనే, దానివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర సర్కార్ ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం(Auto Drivers 12000) తమ బాధ్యత అని చెప్పారు. ‘‘అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్‌ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. క్రానీ క్యాపిటలిజంను ప్రోత్సహించే ఆలోచనే మాకు లేదు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వండి తీసుకుంటాం. రాజకీయాలు వదిలి రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడదాం’’  అని శ్రీధర్​ బాబు తెలిపారు.

Also Read : Amitabh – Ayodhya : రామయ్య సన్నిధిలో అమితాబ్.. అయోధ్యలో మెగాస్టార్ ఏం చేయబోతున్నారంటే..

‘‘తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో మేం ప్రతిపక్షం సలహాలను సైతం వింటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు ప్రజలకు మేలు చేస్తాయి అనుకుంటే వాటిని కూడా కొనసాగిస్తాం. ఎప్పటికైనా ప్రజాసంక్షేమమే మా అంతిమ లక్ష్యం. ఇప్పుడే మా ప్రయాణం మొదలుపెట్టాం. ఇంకా చాలా పాలసీలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. అవి ప్రజలకు మేలు చేస్తాయనుకుంటే తప్పకుండా స్వీకరిస్తాం. రాజకీయాలు మాట్లాడుకునేందుకు మనకు చాలా వేదికలున్నాయి. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రగతి గురించి చర్చిద్దాం’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి   శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణలోని అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చేస్తామని ఆయన ఈసందర్భంగా స్పష్టం చేశారు.

Also Read :Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న