Site icon HashtagU Telugu

Annaram Saraswati Barrage : తెలంగాణలో మరో బ్యారేజీ లీకేజ్..ఏంటి కేసీఆర్ సార్ ఇది

Annaram Saraswati Barrage

Water Leakage From Annaram

తెలంగాణ ప్రభుత్వాన్ని వరుస బ్యారేజ్ ల లీకేజ్ లు తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda ) పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం సంచలనం రేపగా..దీనిపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉండగా..తాజాగా అన్నారం బ్యారేజ్ (Annaram Saraswati Barrage ) కింది నుంచి దిగువకు భారీగా నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. 18, 19, 20, 48 గేట్ల వద్ద పైపింగ్ ఫెయిల్యూర్ జరిగినట్లు గుర్తించారు. బ్యారేజ్ బేస్ మెంట్ కింది నుంచి నీళ్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ పెరిగితే బ్యారేజ్ కుంగిపోయే ప్రమాదం ఉండటంతో.. ఇరిగేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా.. 1.2 కిలోమీటర్ల పొడవున 66 గేట్లతో అన్నారం సరస్వతి బ్యారేజ్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజీల్లో అన్నారం ఒకటి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజ్ ను నిర్మించారు. తాగు, సాగునీరు కోసం నిర్మించిన ఈ బ్యారేజ్‌లో మొత్తం 66 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యారేజ్‌లో మొత్తం 11.9 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 2016లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా.. 2019లో ఆయనే ప్రారంభించారు.

ఇక గతేడాది వచ్చిన వరదల్లోనే ఇక్కడి డిజైన్‌ లో లోపాలు వెలుగులోకి వచ్చాయి. వరదల కారణంగా ఇక్కడి పంపుహౌస్‌ పూర్తిగా నీటమునిగి అందులోని పరికరాలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 మోటార్లు.. నీటమునగడంతో ప్యానల్ బోర్డ్‌, స్విచ్‌ గేర్‌ పరికరాలు పనికి రాకుండా పోయాయి. ఆ తర్వాత మోటర్ల విడి భాగాలను విప్పి, ఆరబెట్టి.. ఒక్కో మోటార్‌ను ఫిక్స్‌ చేస్తూ వస్తున్నారు.

ఇది ఇప్పుడే కాదు అక్టోబర్‌‌ 9, 2019న కూడా అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. కాంట్రాక్టర్‌ ‌చేసిన నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని నాడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంతో గేట్లకు రిపేర్లు చేయించారు. అంతేకాదు అన్నారం పంప్‌‌హౌజ్‌‌ నుంచి నీటి సరఫరా చేసే పైప్‌‌లైన్‌‌ 2021 జూలై 28న భారీ వర్షాలకు భూమిలో నుంచి పైకి లేచింది. ఇలా వరుసగా ఈ బ్యారేజ్ లోపాలు బయటపడుతుండడం తో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు.

Read Also : Kozhikode – City of Literature : ‘సిటీ ఆఫ్ లిటరేచర్’‌గా కోజికోడ్.. ‘సిటీ ఆఫ్ మ్యూజిక్‌’గా గ్వాలియర్‌