Site icon HashtagU Telugu

Annamalai: బండి గెలుపు కోసం రంగంలోకి దిగిన అన్నామలై

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఆయన గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని, దక్షిణ భారతదేశంలో బిజెపిని బలోపేతం చేయడానికి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. బండి సంజయ్ పోరాటాలు దేశానికే ఆదర్శమని, బండి సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితో తమిళనాడులో పాదయాత్ర చేపట్టానని చెప్పారు.

బండి సంజయ్ గెలిస్తే సామాన్యులు గెలుస్తారని, యువత ఇంటింటికీ వెళ్లి మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం బండి సంజయ్కే పడేలా చూడాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మే బండి సంజయ్ యూత్ ఐకాన్ అని, కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా తమ ఆలోచనలు, ఆగ్రహావేశాలు, పోరాటాలు చేస్తున్నారని అన్నామలై అన్నారు.

అందుకే బండి సంజయ్ కు కరీంనగర్ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించబోతున్నారనే నమ్మకం ఉంది. 6 హామీల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించింది. అబద్ధాల ఆధారంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బండి సంజయ్ కు అడుగడుగునా అవమానం జరిగింది కాబట్టి బండి సంజయ్ కు 60 శాతం ఓట్లు, ఇతర పార్టీలకు 40 శాతం ఓట్లు రావాలి. మోడీ కోసం 5 రోజులు కష్టపడండి మోడీ మీ కోసం ఐదేళ్లు కష్టపడతారని అన్నామలై అన్నారు.