Site icon HashtagU Telugu

Anjani kumar: అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేత, ఈసీ నిర్ణయం

Dgp Anjani Kumar Yadav Susp

Dgp Anjani Kumar Yadav Susp

Anjani kumar: తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా.. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ హోదాలో ఉన్న అంజనీకుమార్ కలుసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయనతో చర్చ జరపడంతో ఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఈసీ ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు.

ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. అయితే ఆయన డీజీపీ హోదాలో కొనసాగుతారా.. మరే ఉన్నత పోస్టులో కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Donald Trump: అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్ ముందంజ.. 61 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ వైపే..!