Police Boss: తెలంగాణ పోలీస్ బాస్ ఈయనే?

మహేందర్ రెడ్డి స్థానంలో కొత్త డీజేపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Dgp

Dgp

తెలంగాణ డీజీపీ (DGP) పోస్టుపై ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై పోలీసు వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డీజీపీ రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. పోలీస్ వర్గాల ప్రకారం.. మహేందర్ రెడ్డి స్థానంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ (Anjani kumar) అవుతారని తెలుస్తోంది. మహేందర్ రెడ్డికి ఆరు నెలలు పొడిగింపు ఉంటుందని ఒకానొక సమయంలో భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనను కేంద్రానికి పంపలేదు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇద్దరు అదనపు డీజీపీ ర్యాంక్ అధికారులు జితేందర్, రాజీవ్ రథన్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు 1991 బ్యాచ్‌కి చెందిన వారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కి ఇద్దరి పేర్ల జాబితాను పంపినట్లు సమాచారం. వారు 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ (Anjani kumar), రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా. ఐదేళ్లకు పైగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ఏసీబీ హెడ్‌గా పనిచేసిన సమయంలో శాంతిభద్రతలు, ఇతర నేరాలను నియంత్రించడంలో అంజనీ కుమార్ తనదైన ముద్ర వేసినందున ప్రభుత్వం ఆయనపై (Anjani kumar) విశ్వాసం ఉంచినట్టు తెలుస్తోంది.

Also Read : PS2: గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’

  Last Updated: 29 Dec 2022, 11:52 AM IST