అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. బిఆర్ఎస్ శ్రేణులు. వచ్చే నెలలో తెలంగాణ లో ఎన్నికలు (Telangana Elections) రాబోతున్నాయి. ఈసారి ఎన్నికలు రంజుమీద ఉండబోతున్నాయి. గత ఎన్నికలు ఓ ఎత్తైతే, ఈసారి ఎన్నికలో ఓ ఎత్తు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హావ పెరిగింది. రెండుసార్లు బిఆర్ఎస్ (BRS) పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) ..చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై చేసిన కామెంట్స్ హైదరాబాద్ (Hyderabad) లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు (Andhra Settlers Votes) బిఆర్ఎస్ కు పడకుండా చేశాయని అంటున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. దాదాపు 37 రోజులుగా బాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ ఒక్క కేసే కెకుండా పలు కేసులు కూడా బాబు ఫై మోపి , బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఈ తరుణంలో బాబు కు సపోర్ట్ గా రాజకీయ నేతలతో పాటు టీడీపీ శ్రేణులు రోడ్ల పైకి వచ్చి సంఘీభావం తెలుపుతుంది. అలాగే హైదరాబాద్ లోను పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు , టీడీపీ శ్రేణులే కాకుండా ఐటీ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసన లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఆందోళనలను మంత్రి కేటీఆర్ ఖండించారు. చంద్రబాబు అక్కడ అరెస్టైతే.. ఇక్కడ ధర్నాలేంటి? ఇక్కడ ధర్నాలు చేయడానికి అనుమతి లేదంటూ వ్యాఖ్యానించారు. అలాగే పోలీసులకు సైతం పలు ఆదేశాలు జారీ చేయడం తో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లే.. అరెస్ట్ చేసి తరలించారు. మొన్నటికి మొన్న కొందరు టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. మెట్రోలో ఎక్కి నిరసన చేపట్టగా.. ఆ వ్యవహారంపైనా మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి ధర్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ధర్నా చేసుకోవాలంటే.. ధర్నా చౌక్‌కి వెళ్లి చేసుకోవాలని సూచించారు.
అయితే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని సెటిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు అరెస్టైతే.. ఆందోళన చేపట్టే అర్హత లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. తమను తక్కువ చేసి చూస్తున్న కేటీఆర్‌కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు. కూకట్‌పల్లి, మాదాపూర్, మల్కాజిగిరి వంటి కొన్ని స్థానాలో విజయాన్ని నిర్దేశించే స్థాయిలో సెటిలర్లు ఉన్నారు. తాజా పరిణామాలతో వీరంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. బీఆర్‌ఎస్ పార్టీకి భారీ నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కేటీఆర్ తన పంధా మార్చుకుంటారా..? లేక ఇలాగే వ్యవహరిస్తారా..? అనేది చూడాలి.
Read Also : TCS Dress Code : ఉద్యోగులకు ‘డ్రెస్ కోడ్’.. ఐటీ దిగ్గజం కీలక ప్రకటన