Hyderabad Land Deals : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో మన దేశంలో అత్యధిక ల్యాండ్ డీల్స్ ఎక్కడ జరిగాయో తెలుసా ? మన హైదరాబాద్‌లో ఎన్ని ల్యాండ్ డీల్స్ జరిగాయో తెలుసా ? ఇలాంటి సమాచారంతో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’(Anarock) సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘అనరాక్’ నివేదిక ప్రకారం..
- ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో మనదేశంలోని ప్రధాన నగరాల్లో భూముల కొనుగోళ్ల లావాదేవీలు 57 శాతం తగ్గిపోయాయి. ఈ వ్యవధిలో 325 ఎకరాలకు సంబంధించిన కేవలం 25 ల్యాండ్ డీల్స్ జరిగాయి.
- మన హైదరాబాద్‌లో(Hyderabad Land Deals) కేవలం ఒకే ఒక ల్యాండ్ డీల్ జరిగింది. 48 ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పందం జరిగింది.
- ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు అధిక ధరలు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అనరాక్ తెలిపింది.
- గత సంవత్సరం ఇదే టైంలో (ఏప్రిల్-జూన్‌లో) మనదేశంలో 721 ఎకరాల కొనుగోళ్లకు సంబంధించిన 29 భూ ఒప్పందాలు జరిగాయి.
- ఇక ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో 54 ల్యాండ్ డీల్స్ ద్వారా 1,045 ఎకరాల భూముల కొనుగోళ్లు జరిగాయి.
- ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో బెంగళూరులో 15 ల్యాండ్ డీల్స్ (216 ఎకరాలు), , గురుగ్రామ్‌లో 15 ల్యాండ్ డీల్స్ (162 ఎకరాలు) జరిగాయి. ముంబైలో 5 ల్యాండ్ డీల్స్ (34 ఎకరాలు) జరిగాయి. హైదరాబాద్‌లో 3 ల్యాండ్ డీల్స్ (63.5 ఎకరాలు), చెన్నైలో 3 ల్యాండ్ డీల్స్ ( 48 ఎకరాలు) జరిగాయి.
- 2023 సంవత్సరంలో జనవరి-జూన్ మధ్యకాలంలో 46 ల్యాండ్ డీల్స్ (950 ఎకరాలు) జరిగాయి.
Also Read :Economic Survey 2024 : కాసేపట్లో బడ్జెట్ సెషన్ షురూ.. పార్లమెంటు ముందుకు ‘ఆర్థిక సర్వే’
మీరు కొనబోయే ఆస్తికి ‘రెరా’ రిజిస్ట్రేషన్ ఉందా ?
సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈక్రమంలో కొందరు అనుమతులు లేని ప్రాజెక్టులు కొని నష్టపోతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఆమోదం గురించి తెలుసుకోవాలి. మనం కొనబోయే భూమికి రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాంటి భూమిని, ఆస్తిని సందేహం లేకుండా కొనేయొచ్చు. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రెరా రిజిస్ట్రేషన్ నంబరుతో ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ముందుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ https://rera.telangana.gov.in/Home/ OrdersofAuthority ను ఓపెన్ చేయాలి. సర్వీసెస్ నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.అనంతరం సెర్చ్ ప్రాజెక్టు డీటెయిల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రాజెక్టు పేరు, ప్రమోటర్ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబరును నమోదు చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో ప్రాజెక్టు వివరాలు, రిజిస్ట్రేషన్ స్థితిని తెలిపే పట్టిక కనిపిస్తుంది.