KCR Journey: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001లో టిఆర్ఎస్ ని ఏర్పాటుచేసిన కేసీఆర్ 2014లో రాష్ట్రాన్ని సాధించారు. 2014 నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓటమెరుగని లీడర్ గా చెప్పుకునే కేసీఆర్ తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ లీడర్ అనంతుల మదన్ మోహన్ చేతిలో సీఎం కేసీఆర్ ఓడిపోయారు. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గంలో అనంతుల మదన్ మోహన్ బరిలో దిగారు. నందమూరి తారకరామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మదన్ మోహన్ చేతిలో కెసిఆర్ ఓడిపోయారు. మదన్ మోహన్ కు 28, 766 ఓట్లు రాగ, కేసీఆర్ కు 27, 899 ఓట్లు వచ్చాయి. కేవలం 887 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. అయితే అప్పటికే మదన్ మోహన్ మూడుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో కేసీఆర్ కు ఓటమి తప్పలేదు. నిజానికి ఆ ఏడాది జరిగిన ఎన్నికలతోనే కేసీఆర్ మొదటిసారి పోటీ చేశారు. ఆ ఓటమితో కేసీఆర్ నిరాశ పడలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోనంతగా ప్రభావం చూపిస్తూ సీఎం స్థాయికి ఎదిగారు. కేసీఆర్ ఇప్పటివరకు 13 సార్లు విజయం సాధించారు.తొలి ఎన్నికలలో ఓటమి రుచి చూపించిన అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్ రెండు సార్లు ఓడించారు. 1989, 1994 అసెంబ్లీ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట నియోజకవర్గంలోనే కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
నిజానికి అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్ రాజకీయ గురువుగా చెప్తారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో మదన్ మోహన్ చురుకుగా పాల్గొనేవారు. కేసీఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తొలినాళ్లలో కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో మదన్ మోహన్‌కు సన్నిహితంగా ఉండేవారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంతో కేసీఆర్ అందులో జాయిన్ అయ్యారు. మదన్ మోహన్ పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డిల మంత్రివర్గాలలో రెవెన్యూ, ఆరోగ్యం, విద్యా శాఖ వంటి కీలక శాఖలకు ఆయన మంత్రిగా కొనసాగారు. ఇక 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసిన ఓడిన మదన్ మోహన్ ఆ తర్వాత ప్రభావం చూపించలేకపోయారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో ఆయన మరణించారు.
Also Read: Journalists protest : 16 మీడియా సంస్థల జర్నలిస్ట్ లు సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ