Karimnagar – Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి.. గెస్టులకు గిఫ్టుగా కరీంనగర్ ఫిలిగ్రీ ప్రోడక్ట్స్

ముకేశ్‌ అంబానీ అపర కుబేరుడు. ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి అంటే ఆషామాషీ విషయమా ?

  • Written By:
  • Updated On - May 23, 2024 / 12:02 PM IST

Karimnagar – Anant Ambani : ముకేశ్‌ అంబానీ అపర కుబేరుడు. ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి అంటే ఆషామాషీ విషయమా ? ఈ పెళ్లికి వచ్చే అతిథులకు ఇచ్చేందుకు మన కరీంనగర్ నుంచి గిఫ్టులు వెళ్లాయి. ఇంతకీ ఆ గిఫ్టులు ఏమిటో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జులై 12న అనంత్‌ అంబానీతో  జరగనుంది. ఈ పెళ్లికి వెళ్లే అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ వస్తువులను బహుమతిగా ఇవ్వనున్నారు. దాదాపు 400 ఫిలిగ్రీ వస్తువులకు ముకేశ్ అంబానీ కుటుంబం ఆర్డర్‌ చేసిందని కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ వెల్లడించింది. కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులకు 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపింది. జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర డిజైన్ల ఫిలిగ్రీ వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చారు. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను కూడా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులే తయారు చేసి పంపించారు.

Also Read :Threat Call : ప్రధాని మోడీని చంపేస్తా.. ఎన్ఐఏ కంట్రోల్ రూమ్​కు ఫోన్ కాల్

గత ఏడాది జనవరిలోనే అనంత్ అంబానీ(Karimnagar – Anant Ambani), రాధికా మర్చంట్‌ల ఎంగేజ్మెంట్ జరిగింది. తదుపరిగా ఈ ఏడాది మేలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేవలం ఆహార ఏర్పాట్ల కోసమే దాదాపు 300 కోట్లు ఖర్చు చేశారు. ఇక అసలు సిసలైన పెళ్లి  జులై 12న ముంబైలో జరగబోతోంది. దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం ఆకర్షణీయమైన బహుమతులు సిద్దం చేస్తున్నారు.

Also Read: Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..

క్రూయిజ్ షిప్‌లో రెండో రౌండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్

అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో రెండో రౌండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రెడీ అవుతున్నారు.  ఇవి మే 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. అయితే ఈసారి ఏకంగా సముద్రంపైనే ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లగ్జరీ క్రూయిజ్‌ను ఏర్పాటు చేశారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4,380 కి.మీ దూరం ఈ ‍క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ వేడుకలు జరుపుకుంటారు. ఇందులో మొత్తం 800 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. 600 మంది సిబ్బంది వారి కోసం ఏర్పాట్లు చేస్తారు. మే28 నుంచి జరగబోయే రెండో రౌండ్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌‌లో సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.