హుజూరాబాద్ పీఠం దక్కేది ఎవరికో.. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే!

హుజూరాబాద్ ఉప ఎన్నికను పరిశీలిస్తే.. సాధారణ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నట్టు ఉంది కదా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బె చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక అని పార్టీలకు సవాల్ ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు... ఇలా ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఒక్కసారి విశ్లేషిస్తే..

  • Written By:
  • Updated On - September 30, 2021 / 05:25 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికను పరిశీలిస్తే.. సాధారణ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నట్టు ఉంది కదా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక అని పార్టీలకు సవాల్ ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు… ఇలా ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఒక్కసారి విశ్లేషిస్తే..

అధికార పార్టీ భూకబ్జా ఆరోపణలు చేయడంతో ఈటల రాజేందర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే హుజూరాబాద్ తన సిట్టింగ్ స్థానం కావడం, తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు ఈటల శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా గెలిచి హుజూరాబాద్ లో తనకు తిరుగులేని చెప్పడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతోనే, ఇతర పార్టీల కంటే ముందుగా ప్రచారానికి తెరలేపారు. నోటిఫికేషన్ వెలువడక ముందే హుజూరాబాద్ మొత్తం కలియతిరిగారు. పాదయాత్ర చేపట్టి ఇంటింటికి తిరిగి నియోజకవర్గ ప్రజల మద్దతు కూడగట్టారు. ఈ క్రమంలో ఆయన కాలు సైతం ఫ్యాక్చర్ అయినా తన పాదయాత్రను ఆపలేదు. కేసీఆర్, కేటీఆర్ లు వచ్చినా హుజూరాబాద్ లో తనను కొట్టేవారు లేరని ధీమా వ్యక్తం చేస్తున్నారాయన.

హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు అంటగట్టి.. ఈటల చేత రాజీనామా చేయించిన ఆ పార్టీ ఆరునూరైనా హుజూరాబాద్ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే దళిత బంధు ప్రకటించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. కేవలం ఈ ఉప ఎన్నిక కోసమే ఇద్దరు మంత్రులు, పది ఎమ్మెల్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. పెద్ద తలకాయ అయినా ఈటలను ఈ ఎన్నికలో ఓడిస్తే రాజకీయాకంగా తమకు తిరుగులేదని భావించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే టబుల్ షూటర్ హరీశ రావు రంగంలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు కోసం రాత్రి, పగలు పనిచేస్తున్నారు. దళితబంధు ప్రవేశపెట్టడంతో ఇక విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినప్పటికీ, హుజూరాబాద్ లో మాత్రం వెనుకబడిపోయారని చెప్పక తప్పదు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. అయితే రేపో, మాపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.