Site icon HashtagU Telugu

Minister Ponguleti : మంత్రి పొంగులేటికి ఊహించని పరిణామం

Ponguleti Jeevanreddy

Ponguleti Jeevanreddy

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasreddy) కి జగిత్యాల పర్యటనలో ఊహించని పరిణామంఎదురైంది. జిల్లా పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ టీజే జీవన్ రెడ్డిని కలిసి ఆలింగనం చేసుకునేందుకు ఆయన ముందుకు వెళ్లారు. అయితే జీవన్ రెడ్డి (Jeevan Reddy) తేలికగా వెనకడుగు వేసి ఆయన ప్రయత్నాన్ని తిరస్కరించారు. ఈ ఘటన అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మరోవైపు మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా జీవన్ రెడ్డి “ఇక మా పని అయిపోయింది.. మీ రాజ్యం మీరు ఏలండి” అనే వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో జీవన్ రెడ్డి ఇప్పటికే పార్టీ తనను పక్కన పెడుతోందని, ప్రాధాన్యం ఇవ్వడం లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పర్యటనలోను తన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో పాట వచ్చేస్తుందోచ్ !!

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన పొంగులేటి.. ప్రస్తుతం తెలంగాణలో కీలక మంత్రుల్లో ఒకరుగా ఉన్నా, జిల్లా రాజకీయాల్లో ఇంకా కొందరు నేతలతో పాత విభేదాలు కొనసాగుతున్నట్లు ఈ ఘటన చూపుతోంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి రాజకీయ పరస్పర విమర్శలు ఇంకా ఎక్కువయ్యే అవకాశముంది.