Amrabad TigerReserve Zone : నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ నల్లమల అభయారణ్యం (Amrabad Tiger Reserve Zone Nallamala)లో జరుగుతున్న సఫారీ రైడ్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులకు ఓ ప్రత్యేక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా ఓ పెద్దపులి సఫారీ వాహనాల ముందుకు రావడం, వాహనాల దారిలో అంగరంగ వైభవంగా నడుస్తూ, పర్యాటకులను ఆశ్చర్యపరచింది. పులి ఆకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చి, సఫారీ వాహనాల ముందు గంభీరంగా నడవడం చూసిన పర్యాటకులు ఒక వైపు సంబరంగా భావించగా, మరో వైపు భయంతో కూడిన ఆందోళనతో కూడుకున్న అనుభవం వారికి ఎదురైంది. అయితే, పులి తన గమనాన్ని కొనసాగిస్తూ, సఫారీ వాహనాల ముందు నుంచి ఆడవిలోకి వెళ్లిపోయింది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులకు అనేక వినోదాత్మక కార్యక్రమాలను అందిస్తుంది. ఫరహాబాద్ వద్ద సఫారీ రైడ్, అటవీ ట్రెక్కింగ్, ప్రకృతి అందాలతో చుట్టుకున్న కాటేజీలలో బస చేసే అనుభవం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వీటితో పాటు చెంచు మడ్ హౌస్, ట్రీ హౌస్, ఏర్కాన్ హౌస్ వంటి వివిధ వసతులను కూడా అందిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ గా గుర్తించబడింది.
Melbourne Cricket Club: మెల్‌బోర్న్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా సచిన్ రికార్డు!
ఈ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలను అలంకరించే నల్లమల అడవిలో ఉంది. ఇది 5,937 చ.కి.మీ విస్తీర్ణంతో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ – శ్రీశైలం అభయారణ్యం లో భాగంగా ఉంది. నల్లమల అడవిలో పులులు, వలస పక్షులు, , కృష్ణా నది ప్రవహించడం ఈ అభయారణ్యానికి ప్రధాన ఆకర్షణ.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 42 పులులు, 187 చిరుతపులులు ఉండగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్‌లో 34 పులులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 15 ఆడ పులులు, 11 మగ పులులు, 8 పులి పిల్లలు ఉన్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో 8 పులులు సంచరిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ హైదరాబాద్ నుండి దాదాపు 155 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ రెండు రోజులపాటు పర్యటించేందుకు సరిపోతుంది.
ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా మారింది, ఇందులో పర్యాటకులకు స్వచ్ఛమైన ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
AP Mega DSC : డీఎస్సీకి వరుస బ్రేకులు.. నిరుద్యోగుల ఎదురుచూపులు..