Site icon HashtagU Telugu

Cash Seized : ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ కారులో రూ. 3.50 కోట్లు లభ్యం

Cash Seized

Cash Seized

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. సైకిల్ దగ్గరి నుండి భారీ వాహనం వరకు ఏది వదలడం లేదు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు (Cash) లభ్యం అవుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి వందల కోట్లు పట్టుబడ్డాయి.

తాజాగా ఈరోజు బంజాహిల్స్ (Banjara Hills) లో పోలీసుల తనిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి (AMR Group Chairman Mahesh Reddy) కారులో రూ. 3.50 కోట్లుపట్టుబడ్డాయి. న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబర్ 9 నుంచి శుక్రవారం రాత్రి వరకూ జరిపిన తనిఖీల్లో.. మొత్తం రూ.286.74 కోట్ల విలువైన డబ్బు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ ఇతరత్రా ఐటెమ్స్ సీజ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో, ఆ క్షణం నుంచే పోలీసులు అలర్ట్ అయిపోయారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల దగ్గర భారీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి భారీగా డబ్బు వస్తున్నట్లు గ్రహించిన పోలీసులు.. అక్కడ బాగా నిఘా పెట్టి.. భారీగా అక్రమ సొత్తును సీజ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో జోరుగా తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేల కంటే మించిన మనీని ఎవరైనా తీసుకెళ్తూ ఉంటే, వాటికి సంబంధించిన బిల్లులు, ఆధారాలు అడుగుతున్నారు. అవి చూపించకపోతే, ఆ డబ్బును సీజ్ చేస్తున్నారు.

Read Also : Cheruku Sudhakar : బీఆర్ఎస్ పార్టీలో చేరిన చెరుకు సుధాక‌ర్