Amit Shah: శభాష్ సంజయ్…నీ పనితీరు భేష్..అమిత్ షా హర్షం…అంతలోనే..?

శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన వేడుకల అనంతరం అమిత్ షా బేగంపేటలోని టూరిజమ్ ప్లాజాలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
BJP CM

Amit Shah Bandi Sanjay

శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన వేడుకల అనంతరం అమిత్ షా బేగంపేటలోని టూరిజమ్ ప్లాజాలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలోపార్టీ బలోపేతం, మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు. ఈసమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికతోపాటుగా…తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం…ఈ విషయాల గురించి పార్టీ నేతలకు అమిత్ షా మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. ఇక బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రను  అమిత్ షా ప్రశంసించారు. ప్రజాసంగ్రామ యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. మిగతా నేతలంతా కూడా ప్రజల్లోనే ఉండాలని సూచించారు.

మునుగోడు ఉపఎన్నికపై మరింత ఫోకస్ పెట్టాలన్నారు అమిత్ షా. ఈ ఉపఎన్నిక కోసం త్వరలోనే పార్టీ తరపున కమిటీ నియమించున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో అమిత్ షా పార్టీ నేతలపై మండిపడ్డట్లు సమాచారం. పార్టీలో ఐక్యత లోపించిందని..తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారట. నాయకులు కష్టపడకుండా విజయం సాధించలేమని అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది.

  Last Updated: 18 Sep 2022, 07:26 AM IST