Amit Shah Meets Etela: ఈటల ఇంటికి అమిత్ షా.. కీలక అంశాలపై చర్చ!

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే జాతీయ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  శామీర్‌పేటలోని ఆయన ఇంటిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కలిశారు. ఇటీవల మృతి చెందిన ఈటెల రాజేందర్ తండ్రి మృతి పట్ల అమిత్ షా సంతాపం తెలిపారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబాన్ని కేంద్ర హోంమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి […]

Published By: HashtagU Telugu Desk
Etala

Etala

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే జాతీయ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  శామీర్‌పేటలోని ఆయన ఇంటిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కలిశారు. ఇటీవల మృతి చెందిన ఈటెల రాజేందర్ తండ్రి మృతి పట్ల అమిత్ షా సంతాపం తెలిపారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబాన్ని కేంద్ర హోంమంత్రి పరామర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కేంద్ర హోంమంత్రితో ముచ్చటించారు. ఈటల రాజేందర్‌ (Eatala Rajender)కు ఆ మధ్య బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈటలను పార్టీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలతో ఈటల రాజేందర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టే ఆయన పనిచేస్తూ.. చాలామంది నేతలను బీజేపీలో చేరేలా పావులు కదిపారు. అటు అధికార టీఆర్ఎస్‌పైనా దూకుడు పెంచారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈటల చాలా స్ట్రాంగ్ వాయిస్‌తో మాట్లాడారు. ఈ సమయంలో.. ఈటల రాజేందర్‌తో అమిత్ షా ఏకాంతంగా చర్చలు జరపడం పొలిటికల్ కారిడార్‌‌లో హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు లో బీజేపీ వ్యూహంతో పాటు తెలంగాణ పార్టీ పటిష్టత, ఇతర కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం.

  Last Updated: 17 Sep 2022, 05:39 PM IST