Amit Shah to Telangana: మిషన్ తెలంగాణ షురూ.. ఈనెల 28న రాష్ట్రానికి అమిత్‌ షా

తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారమే ధ్యేయంగా కమలనాథులు తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తర భారతంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి సారించింది. తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు.

  • Written By:
  • Publish Date - January 11, 2023 / 06:38 AM IST

తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారమే ధ్యేయంగా కమలనాథులు తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తర భారతంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతంపై దృష్టి సారించింది. తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 19న హైదరాబాద్ వచ్చి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే హోంమంత్రి అమిత్ షా రాక కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ నేతలు పదే పదే తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరో ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చునని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ స్థాయిల పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ఆయన పర్యటనలో ప్రధాన ఎజెండా. తెలంగాణ ఎన్నికల సీజన్ పై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సంఘ్ నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమిత్ షా గతేడాది 5 సార్లు తెలంగాణకు వచ్చారు. మరోవైపు ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ప్రారంభించనున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో మోదీ ప్రసంగం జరిగే అవకాశం ఉంది.

Also Read: Nabha Natesh : ప్రమాదం వల్లనే సినిమాలకు గ్యాప్..నభా నటేశ్!

మరోవైపు అంతకంటే ముందే రాష్ట్రంలో కేసీఆర్, మోదీల బహిరంగ సభలు జరగనున్నాయి. రెండు రోజుల తేడాతో రెండు బహిరంగ సభలు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. మోదీ, అమిత్ లపై కేసీఆర్ విమర్శలు చేస్తుంటే బీజేపీ నేతలంతా కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ అదే స్థాయిలో విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. కాగా, అమిత్ షా ఈ నెల 8న ఏపీలో పర్యటించాల్సి ఉంది. అయితే అదే రోజు కర్ణాటకలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన ఏపీకి ఎప్పుడు వస్తారనేది త్వరలోనే బీజేపీ నేతలు ప్రకటించనున్నారు.

టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్‌ ఇటీవల ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై చార్జిషీట్‌ దాఖలు చేస్తామని, మిషన్‌ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించిందని ఆయన వివరించారు.