Site icon HashtagU Telugu

Amit Shah: నేడు తెలంగాణ‌కు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు (జూన్ 29, 2025) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన నిజామాబాద్‌లో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన షెడ్యూల్ వివరాలను కేంద్ర హోం శాఖ అధికారులు విడుద‌ల చేశారు. మధ్యాహ్నం 1:00 గంటకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుండి 1:45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత డీఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఈ పర్యటన తెలంగాణలో వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా పసుపు రైతులకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ పసుపు బోర్డు స్థాపన ద్వారా స్థానిక రైతులకు మద్దతు అందించే లక్ష్యంతో జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా పసుపు ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంది. ఈ బోర్డు స్థాపనతో రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహాయం, ఆర్థిక మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది, ఎందుకంటే అమిత్ షా ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా వ‌స్తున్నాయి.

Also Read: Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల‌కు కోపం ఎక్కువ‌ట‌..!

అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక బీజేపీ నాయకత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులు ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

పసుపు బోర్డు కల 40 ఏళ్ల చరిత్ర: ఎంపీ అరవింద్

40 ఏళ్ల ప‌సుపు బోర్డు క‌ల సాకార‌మ‌వుతుంద‌ని నిజామాబాద్ ఎంపీ అర‌వింద్ పేర్కొన్నారు. కల సాకారమవుతున్న వేళ రైతులకు పండ‌గేన‌ని ఆయ‌న అన్నారు. ఈ బోర్డు ద్వారా పసుపు రైతులకు ఎనలేని మేలు చేకూరనుందని, పసుపు పరిశోధనపై కొత్త అధ్యయనం మొదలుకానుందని ఎంపీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. నేటి అమిత్ షా సభను రైతులు విజయవంతం చేయాలని ఆయ‌న కోరారు.