Site icon HashtagU Telugu

Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే…

Amit Shah

Amit Shah

Amit Shah: తెలంగాణాలో కషాయ జెండా ఎగురవెయ్యడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బలం లేనప్పటికీ కేసీఆర్ పాలపై విసుగెత్తిన ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఓటు బ్యాంకు సంగతి అటుంచితే అధికార పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణాలో భారీ బహిరంగ సభకు హాజరవ్వనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం చేవెళ్ల నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు మరియు చేవెళ్లలో ‘విజయ్ సంకల్ప సభ’ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలపై కూడా ఆయన మాట్లాడనున్నారు. అలాగే నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. బహిరంగ సభ అనంతరం కేంద్ర హోంమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు సభకు పార్టీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇదే..

– ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

– మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు.

– సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశం అయి పలు విషయాలను పంచుకుంటారు.

– సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది.

– సాయంత్రం 5.15 గంటలకు అమిత్‌ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు.

– సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొంటారు.

– తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు.

వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర భారతంలో గట్టి పట్టు సాధించిన తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ట్రాలపైనే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ పార్టీకి పాపులారిటీ పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

Read More: Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా ఈటలకు సవాల్ విసిరిన రేవంత్‌.. నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ ఫైర్..!